కెన్ యూ ఫీల్ హర్?
ఈజ్ యువర్ హార్ట్ స్పీకింగ్ టు హర్?
కెన్ యూ ఫీల్ ద లవ్? యస్.
ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే..
చిరు చెమటలు పోయనేలా..
యే శిల్పి చెక్కెనీ శిల్పం
సరికొత్తగా ఉంది రూపం
కనురెప్ప వెయనీదు ఆ అందం
మనసులోన వింత మోహం
మరువలేని ఇంద్ర జాలం
వానలోన ఇంత దాహం..
చినుకులలో వాన విల్లు నేలకిలా జారెనే
తళుకుమనే ఆమె ముందు వెల వెల వెలబోయెనే
తన సొగసే తీగలాగ నా మనసే లాగెనే
అది మొదలు ఆమె వైపే నా అడుగులు సాగెనే
నిశీధిలో ఉషోదయం ఇవాలిలా ఎదురే వస్తే
చిలిపి కనులు తాళమేసే చినుకు తడికి చిందులేసే
మనసు మురిసి పాటపాడే తనువు మరిచి ఆటలాడే..
ఏమైంది ఈ వేళ యెదలో ఈ సందడేల
మిల మిల మిల మేఘమాల
చిటపట చినుకేయు వేళ
చెలి కులుకులు చూడగానే..
చిరు చెమటలు పోయనేలా…
ఆమె అందమే చూస్తే మరి లేదు లేదు నిదురింక
ఆమె నన్నిలా చూస్తే యెద మోయలేదు ఆ పులకింత
తన చిలిపి నవ్వుతోనే పెనుమాయ చేసేనా
తన నడుము వొంపులోనే నెలవంక పూచెనా
కనుల ఎదుటే కలగ నిలిచా
కలలు నిజమై జగము మరిచా
మొదటి సారి మెరుపు చూసా..
కడలిలాగే వురకలేసా…
No comments:
Post a Comment