Tuesday, September 21, 2010

Little Angel

Tuesday, September 7, 2010

నా మదిలొ నిన్ను నేను గుర్తించాను..:) :(

ఎర్రగులాబీలు వీరాబూసిన తోటలొ పూవులకు కరువా??

నీ పెదవులపై నుంచి వచ్చే మాటల కోసం ఎంతగా పరితపిస్తున్నానొ గుర్తించవా??????

నా మదిలొ నిన్ను నేను గుర్తించాను........................

ఒకప్పుడు రోజుకి 23వేలసార్లు నీకు క్షమాపణలుచెప్పాలని పరితపించాను......
(మనిషి రోజుకి 23వేలసార్లు శ్వాస పీలుస్తాడు)

నా హృదయం రోజుకి లక్షాముడువేలసార్లు నీతో మాట్లాడాలని భావించేది.......
( మనిషి హృదయం రోజుకి లక్షాముడువేలసార్లుకొట్టుకుంటుంది)

అవునూలే! నా మనసులో మ్రోగిస్తున్న గుడి గంటలు నీకు ఎలా వినబడతాయి?????
నీ మనసు ఇంకా కరగలేదు...!!! నీ గొప్పదనం తెలుస్తుందిలే....!!!

బహుశా...ఈ జన్మకు నీతో స్నేహంగా ఉండే అదృష్ట౦ కూడా నాకు లేదేమో?????????

Monday, September 6, 2010

హృదయకుటీరంలో......

హృదయకుటీరంలో చూపుల జ్యోతులు వెలిగించి,..

వసంత కుసుమాల అక్షరమాలతో మనోభావగీతాంజలి వినిపించి,..

కనుకొలనులలో దాగిన అశ్రుగోదారిని స్వాతి చినుకుల పలకులని తలచి,..

క్షనికమని భావించిన భావోద్వేగాలను క్షణక్షణం ఆత్మియతా అక్షరాలతో నింపి,..

మనసాక్షి న్యాయస్థానంలో అంతరాత్మా తీర్పు ఏమిటని ఎదురుచూస్తున్నాను,...!

Sunday, September 5, 2010

ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలు

నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి

ఐనా ఆదియుగంనుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి

జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు

సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు

అతడు ...ఉపాధ్యాయుడు - సృష్టి స్థితి లయల నిర్దేశకుడు !

Friday, September 3, 2010

నాలో నేను..............



మేఘంలా నేనెప్పుడు కరిగిపోతానొ నాకే తెలియదు.
ప్రాతః నిశీధిలలొ ఏ మరీచికకి స్పందించి మొగ్గ విచ్చుకుంటుందో.. ఎందుకు విచ్చుకుంటుందో..!
వసంతానికే కోయిలెందుకు రాగాలుపోతుంది?..వెన్నెలరేడే కలువెందుకు వగలుపోతుంది?..

వీటికసలు లాజిక్కే ఉండదు. నేనూ అంతే.

దారిలొ ఎవరి పాదాల కిందో నలిగిపోయిన గొంగళిపురుగు మృతి కొన్ని రోజులపాటు నన్ను కలిచివేస్తుంది.
కానీ కొన్నిసార్లు సాటి మనిషి చనిపోయినా కించిత్ దుఃఖం కూడా కలగదు.

రోజూ సాయంత్రం వాకిట్లోకి వచ్చే పిట్ట ఒకరోజు రాకపోయేసరికి అనూహ్యంగా ఏడ్చేసిన సందర్భముంది.
నిర్లిప్తంగా కొన్ని రోజులు గడిపాక హటాత్తుగా ఓ చిన్నారి నవ్వునో, విరిసిన పువ్వునో, పళ్లూడిన బామ్మనో చూసి స్పందించి మనసు నెమలిలా నర్తించిన సందర్భాలూ ఉన్నాయి.

నాకు సముద్రమంత ప్రేమ కావాలి..


చిన్నప్పటి నుండీ నాకంత ప్రేమ ఇవ్వగలిగేవారెవరా అని ఎదురుచూసాను.. వెతికాను.
కానీ అందరివీ నాలా ఎదురుచూసే కళ్ళే. తీసుకోవాలనుకునే మనసులే.. మనుషులే.
వెతికే ప్రయత్నంలో నా కుటుంబం నుండి దూరమయ్యాను... విఫలమయ్యాక ఒంటరినయ్యాను...

విసిగి కొన్నాళ్లకి అప్రయత్నంగా నేనే ఇవ్వడం మొదలుపెట్టాను (ఆర్తిగా ఆశించేవారికే తెలుస్తుంది.. ఇవ్వడం ఎంత గొప్పదో!).

ఇస్తూ ఇస్తూ.. సముద్రమయ్యాను

Thursday, September 2, 2010

ANU Campus


I got a seat in ACHARYA NAGARJUNA UNIVERSITY COLLEGE,GUNTUR (ANCU) in MASTER OF BUSINESS ADMINISTRATION (MBA)
తేనె వానలో తడిసిపోతున్నట్టుంటుంది...గతంలోకి తొంగి చూస్తుంటే..
వీణతీగనై మురిసిపోతున్నట్టుంది..స్నేహం నన్ను మీటుతుంటే
స్నేహం అంటే ఇంత తియ్యగా ఉంటుందా!...అనిపిస్తుంది
అమ్మో ఏంటి కళ్ళు చెమరుస్తాయా.. ఇప్పుడు
ఈ స్నేహపు పేజీలు వెనక్కితిప్పి చూస్తూఉంటే..
ఏదో అందమైన అనుభూతి ...
మనసు ..చక్కిలిగింతలు పెట్టినప్పుడు నవ్వే చంటి పాపలా
స్వఛ్ఛంగా నవ్వుతుంది
నవ్వలేక పరవశంలో ఉక్కిరి బిక్కిరి అవుతుంది
అంతలోనే ఈపరిచయం లేకుంటే అన్నతలపు
ఆ ఊహే చాలా కర్కశంగా ఉంటుంది...
ఆ భయంలోంచే అసలు ఈ స్నేహం సత్యమా..స్వప్నమా అనే పిచ్చి అనుమానం
ఈ నిశ్శబ్దాన్ని ఒంటరి తనాన్ని తరిమేస్తూ....
మళ్ళీ ఆ వీణ సరికొత్తరాగంలో ధ్వనిస్తుంది....
భౌ అంటు మళ్ళీ నా చుట్టూ చేరిపోతుంది....

ఇందుకే దేవుడికి ఒక వరం ఇయ్యాలనిపిస్తుంది...
అప్పుడు మనసు దేవుడికి చెప్తుంది...
తీసుకో నాదగ్గరున్నది ఏదైనా ....ఈ స్నేహం తప్ప...
ఇది వరం ఇయ్యటమో దీవెన అడగటమో మాత్రం తనకు తెలియదు.
.

Wednesday, September 1, 2010

Good Morning

కోపానికి బధ్ధ శత్రువు ఓర్పు.ఓర్పు కి ప్రతీక సాలెపురుగు.
గదిలొ ఒక మూల.....,,
నిశబ్దంగా ఓర్పుగా,ఒంటరిగా
అది గూడు కట్టుకుంటుంది.
ఎవరిని సహాయం అడగకుండా,,
ఎవరినీ బాదించకుండ
తన.... నుంచి తాను విడివడుతూ
తనని తాను త్యాగం చేసుకుంటు,పోగు తరవాత పోగు
గొప్ప ఏకాగ్రతతో ఒక శిల్పి చెక్కినట్టు
గొప్ప నైపుణ్యంతో ఒక వైద్యుడు నరాల్ని ముడులు వేసినట్టు,
తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటుంది.

అంతలో...........
ఒక హడావుడి ఉదయాన్నో,
నిశబ్ద సాయంత్ర సమయాన్నో,
గోడమీది నుంచి పెద్ద శబ్దంతో వచ్చిన చీపురుకట్ట,
ఒక్క వేటుతో దాని శ్రమంతా సమూలంగా తుడిచి పెట్టేస్తుంది.
సర్వనాశనమైయిపోయిన సామ్రాజ్యంలోంచి,
సాలెపురుగు అనాధలా నేల మీద పడుతుంది.
ఎవరినీ కుట్టదు.
ఎవరి మీదా.... కోపం ప్రదర్షించదు.
మళ్ళీ తన మనుగడ కోసం,
కొత్త వంతెన నిర్మించుకోవడానికి,
సహనమనే పోగుల్ని....
నమ్మకం....అనే... గోడల మీద తిరిగి స్రవిస్తుంది.
ఎలా బ్రతకాలో... మనిషి కి పాఠం చెబుతుంది.