Thursday, October 28, 2010

అప్పటికీ.. ఇప్పటికీ... ఎప్పటికీ....!


నేస్తమా! ఎందుకు ఇలా చేస్తున్నావు?
నీవు ఎంచేస్తున్నావో నీకు అర్ధం అవుతుందా?
తెలియక చేస్తున్నావని అనుకొలేను.......
ఎందుకంటే అన్ని తెలుసని నువ్వే చెప్పావు!
తెలిసి కూడ చేస్తున్నావంటే???????
నేను బాధపడితే నీకు అంత ఇష్టమా?
లేక నన్ను దూరం చేసుకోవాలని చేస్తున్నావా?
నన్నెందుకు దూరం చేస్తున్నావు నేస్తం?
నేనేం పాపం చేశాను?
నీ స్నేహం కోరుకోవటమే నా నేరమా??
నన్ను "Avoid" చేస్తున్నావని అర్ధమౌతున్నా..
ఎదలొ ఏ మూలో చిన్ని ఆశ అది నిజం కాదేమోనని...
కాని నా కన్నీళ్ళు నిజం చెబుతూనే వున్నాయి నేను నీకేమికానని.
ఇదంతా ఎందుకు చేస్తున్నావు నేస్తమా..?
ఇదే నీ అసలు స్వభావం అనుకుంటే...?
ఇంతకు ముందు నాతొ నీ ప్రవర్తన అంత అబధ్ధమా??
అంటే ఇన్నాళ్ళు నీలో నాకు నచ్చింది అనుకున్నదంత నిజం కాదా??
ఇప్పటివరకు నువ్వు చూపించిన అభిమానం, ప్రేమ అంత నటనా??
అంటే ఇన్నాళ్ళు నువ్వు చెప్పిన ఊసులు, చేసిన బాసలు అన్నీ నా భ్రమేనా?????
ఒకవేళ ఇవన్ని నిజాలు కాకపొతే ఇప్పుడు నువ్వు నువ్వుగా లేవా??
మరి ఎందుకలా? అసలు ఏమి జరిగింది నేస్తం?
ఒక విషయం మాత్రం నీకు అర్ధం అయ్యేలా సూటిగా చెప్పాలనిపిస్తుంది చిన్ని......
"Our friendship is going to die because of lack of care"
నువ్వు ఏ క్షణంలో పిలిచినా పలకడానికి సిధ్ధంగా వుండాలనిపిస్తుంది...
కాని క్షణక్షణం నీ ఆలోచనలతో నా మనస్సు బ్రద్దలవుతుంది.
నిన్ను ఏమి అడగకూడదని క్షణానికి ఒకసారి అనుకుంటాను...
ఇలా ఎందుకు చేస్తున్నావా అని నిమిషానికి అరవైసార్లు ఆలోచిస్తున్నాను.
నా స్నేహంతొ ఆటలాడుకుంటున్నావా నేస్తం?
ఐనా నాకు కొపం రావటం లేదు...
ఎందుకొ తెలుసా నేస్తం..."నువ్వంటే నాకు అంత ఇష్టం"
అప్పటికీ.. ఇప్పటికీ... ఎప్పటికీ....!