నేను చాలా సంతోషంగా ఉన్నాను....
అలుపెరగని ఆలోచనల జీవనపోరాటంలో..
వెన్నెల కన్నుల్లో పున్నమి పూచినట్లు..
చల్లగాలిలో సన్నజాజి నవ్వినట్లు...
నీవందించిన క్షణాలెన్నో...!
కాలం నియంత కనురెప్పపాటు మనసుపడిన సరదా క్షణాలెన్నో..
మమతెరిగిన ఆణిముత్యంలా....
మమకారాలు పంచిన మణిహారం లా....
నా కనులకు కనిపించావు.
మదిలో నెమ్మదిలొ నిన్నెరిగిన నేను...
హృదిలో భువీలో నన్నెరిగిన నీవు..
పువ్వుకు తావిలా అందులో తేనెలా కలిసిలేమా???????
No comments:
Post a Comment