4, ఫిబ్రవరి 2026, బుధవారం

Handwriting

 

​In a village, someone was asked, “Could you please write a letter for us?”

He remained silent for a while, then looked up and said softly—

“I cannot write the letter… my legs are aching.”

​Those who asked burst into laughter. “You need your hands to write a letter, not your feet. Why do your legs matter?” they asked.

​With a faint spark in his eyes, he replied:

My handwriting is hard to understand. Do you know what happens then?

They will say, ‘Send the person who wrote this.’

I would have to walk all the way there.

I don't have the energy to walk that far just to read a letter, so I’ve stopped writing them altogether.”

The Lesson

​After telling this story, my teacher smiled gently and said:

“If the letters aren't clear, the letter won't travel… the writer will have to.”


​That story taught us more about responsibility than just handwriting.

చేతివ్రాత

 

​ఒక ఊరిలో ఒకతన్ని “ఉత్తరం రాయండి” అని అడిగారు.

అతను కాసేపు నిశ్శబ్దంగా ఉండి, తల ఎత్తి చూసి మెల్లగా అన్నాడు 

“నేను ఉత్తరం రాయలేను… నా కాళ్లకు నొప్పి.”

​అడిగిన వాళ్లు నవ్వేశారు. “ఉత్తరం రాయడానికి చేతులు కావాలి గానీ కాళ్లు ఎందుకు?” అన్నారు.

​అతను అప్పుడు కళ్ళల్లో చిన్న వెలుగు పెట్టుకొని చెప్పాడు:

నా చేతివ్రాత వాళ్లకు అర్థం కాదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా?

‘రాసినవాడినే పంపించండి’ అంటారు.

అక్కడికి నేను నడుచుకెళ్లాలి.

నాకు ఉత్తరం చదవడానికి అక్కడిదాకా వెళ్లే ఓపిక లేదు, అందుకే రాయడం మానేశాను.”

ముగింపు

​ఈ కథ చెప్పి మా మాస్టారు మెల్లగా నవ్వుతూ అన్నారు:

“అక్షరాలు స్పష్టంగా లేకపోతే ఉత్తరం ప్రయాణం చేయదు… రాసిన వాడే చేయాల్సి వస్తుంది.”


​ఆ మాట మాకు చేతివ్రాత కంటే బాధ్యత నేర్పింది