Tuesday, February 15, 2011

.

నాతోవున్నపుడు నీనీడను వదలలేదు,
నాతో లేనపుడు నీజ్ఞాపకలను వదలలేదు ఈ నామది
నీ ప్రతి జ్ఞాపకం...నా తోడో ..బాధో తెలియడం లేదు
నీ కాలి సిరిమువ్వలకు వేదికైన ఈ నా హృదయం
ఇపుడు .. నీజ్ఞాపకల క్రింద పాతాలమై పోతోంది
అలనాటి నీ చిరునవ్వులు గుర్తొచ్చి పెదవులు వికసించినా ..
ఈనాడు అదే చిరునవ్వు లేదని నా కన్నులు వర్షిస్తున్నాయి.
ఈ ప్రపంచానికి నీవోక్కదానివే.. కానీ ..
నాకు మాత్రం నువ్వే ప్రపంచమైపోయావు.
ఈ జన్మకు ఇది చాలనుకున్నా నీవోడిచేరి పసిపాపనైన ఆ క్షణం. కాని...
మరుజన్మకూ, జన్మ జన్మలకూ నీవే కావాలనుంది ప్రతి క్షణం
వలచి వరించిన నీ మనసు ఏమంటోంది ?
నన్ను వదిలేయమందా ?
కలిసుందాం కలకాలం అని కలిసి ఏడడుగులు వేసిన నీపాదం ఏమంటోంది ?
నాతో అడుగువేయనంటుందా ?
నేనే నీ ప్రాణం అన్న నీ ఊపిరి ఏమైంది ?
కొత్త ఊపిరి పోసుకుందా ?
నీతో వున్న ప్రతి క్షణం స్వర్గమైంది
నీవు లేని ప్రతి స్వర్గం నాకు నరకంగానే వుంది.
ఆ స్వర్గలోకపు జ్ఞాపకాల ఊపిరితో బ్రతుకుతున్నా ఈ నరకంలో ..,
ఈ జ్ఞాపకాల ఊపిరి ఆగిపోకముందే ..నను చేరు నా ప్రాణమా...!
ఆగిపోయిన ఊపిరి సైతం ఉప్పెనవుతుంది.. నీ నీడతాకితే..
ప్రతి క్షణం నిను తలిచే నా హృదయం ఆగితేనే నీ జ్ఞాపకం ఆగుతుంది ఆ క్షణం

No comments: