Thursday, January 20, 2011

కలవో, "కల"వో.,?


క్షణం క్షణం
నా మనసుకు దగ్గరగా వస్తావు..
అనుక్షణం 
నా తలపులలో విహరిస్తావు..
నేను పీల్చే శ్వాసల్లో
నీ పరిమళాలే వెదజల్లుతావు..
నడి రాతిరిలో 
స్వప్నానివై మరలిపోతావు..
తొలి పొద్దులో
సూర్యునివై వెచ్చని మేల్కొలుపువౌతావు..
కలవో, "కల"వో.,
చెలిగా నన్ను చేరే రోజు కోసం
"కల"వరిస్తూనే ఉంటాను నేస్తం !!

No comments: