Monday, August 16, 2010

ఎప్పటికైనా నన్ను క్షమిస్తావు కదూ!!





నిజమే... నేను నువ్వనుకున్నంత మంచి వాడిని కాదు..

తెలియకుండా చేసిన తప్పులతో నీ మనసు గాయపరచిన కర్కశ హృదయుడిని....
నేను చేసిన తప్పులను ఎప్పటికైనా క్షమిస్తావని పిచ్చిగా నమ్మిన అత్యాశపరుడిని..
నీ మనసు నొప్పించిన ప్రతిసారి క్షమించమని అడగటం తప్ప
ఎలా సముదాయించాలో తెలియని అఙ్ఞానిని...

నువ్వు నా జీవితంలో ఉంటావనే ఆశలోనే ఆనందం వెతుక్కున్న అమాయకుడిని..
నువ్వు నన్ను కాదన్నావన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక విధిని నిందిస్తున్న మూర్ఖుడిని...
నువ్వు ఎప్పటికీ నాతో ఉండబోవన్న ఊహని కూడా భరించలేక కాలాన్ని నిందిస్తున్న నిస్సహాయుడిని...

నా ప్రేమకు స్నేహం ముసుగు తొడగలేక ఇప్పుడు నీ స్నేహాన్ని కూడా తిరస్కరిస్తున్న స్వార్థపరుడిని..
నీ ఙ్ఞాపకాల నుండి దూరంగా పారిపోవాలని ప్రయత్నిస్తూ పదే పదే ఓడిపోతున్న అసమర్థుడిని...
మనసుకు తగిలిన గాయాల్ని కాలమే మానుపుతుందన్న భ్రమలో బతుకుతున్న పిచ్చివాడిని...
ప్రేమలో ఓడినా జీవితంలో గెలవడానికై పోరాడుతున్న మొండివాడిని...

ఎప్పటికైనా నన్ను క్షమిస్తావు కదూ!!

No comments: