Wednesday, December 23, 2020

What Life has taught me in 2020


 




Tuesday, October 20, 2020

తల్లిదండ్రులకుప్రత్యేకం...


సెలవల్లో  పిల్లలను  సినిమాలు, షాపింగులు అంటూ తిప్పడమే కాకుండా ఇలా కూడా చేసి చూడండి. 

1. దగ్గరలోని బ్యాంకుకు తీసుకు వెళ్ళండి. అవి ఎలా పనిచేస్తున్నాయో,ATM. ఎలా పనిచేస్తుందో, వాటివలన లాభాలేంటో చెప్పండి.

2. వీలు చూసుకుని అనాధాశ్రమాలకు తీసుకుని వెళ్ళండి.

వారి బాధలను, కష్టాలను వారికి అర్థం అయ్యేలా చూపించండి.

3. నదుల  దగ్గరికి సముద్రాల దగ్గరికి తీసుకునివెళ్ళండి. తప్పక వారికి ఈతను నేర్పండి. నీటితో  మానవ జీవనం  ముడిపడిన  విధానాన్ని  తెలియజెప్పండి. 

4. రెండు చెట్లను వారికి ఇచ్చి వాటిని  పెంచమని చెప్పండి. చక్కగా పెంచిన వారికి మంచి బహుమతిని ఇస్తామని వారిని ప్రోత్సాహించండి.

5. మీ పిల్లల ముందు రక్తదానం చేయండి.

రక్తం యొక్క ఆవశ్యకతను వారికి తెలియచేయండి.

నాన్న రియల్ హీరో అనుకునేలా ప్రవర్తించండి..

6. Govt. Hospitals కు తీసుకుని వెళ్ళండి.

రోగులు పడే పాట్లను, ఆక్సిడెంట్లు అయితే ఎంత కష్టపడాలో వారికి తెలుపండి.

7. సొంత గ్రామానికి తీసుకుని వెళ్ళి, తాతయ్య, అమ్మమ్మ, బామ్మల, అత్తల, మామల, బాబాయ్ ల  ఆప్యాయతలని వారికి రుచి చూపించండి.

అందరూ కలసి మెలసి వుంటే ఎంత బాగుంటుందో చూపండి.......

8.వ్యవసాయంఅంటే ఏమిటి...?రైతు ఎంత కష్టపడితే మనం తింటున్నామో, పదార్థాలను వృదా  చేయడం ఎంత తప్పో వారికి తెలియజేయండి.

9. దగ్గరలోని పోలీసు స్టేషను, కోర్టు, జైలుకు తీసుకును వెళ్ళండి.జైలు లోని శిక్షలు, వీటిని గురించిన అవగాహన వస్తే వారు అలాంటి తప్పులు చేయకుండా ఉండటానికి వీలు ఉంటుంది.

10. దగ్గర కూర్చో పెట్టుకుని వారి కోరికలేంటో తెలుసుకుని, వారు కోరినవన్నీ కాకుండా ఏది అవసరమో వాటిని మాత్రమే తీర్చి, వారికోసమే మీరు ఉన్నారన్న నమ్మకాన్ని కలిగించండి.

11. గ్రంధాలయాలను సందర్శించే అలవాటు చెయ్యండి.

12. మానవవాదాన్ని , పరిశీలనా తత్వాన్ని, సంస్కరణాభిలాష ను పెంపొందించండి.

13. రాజ్యాంగ విలువలు నేర్పండి...!!


Copy paste from facebook



Wednesday, September 30, 2020

Miracle


 

Thursday, January 9, 2020

Same Feeling

Exactly